బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 10:50:17

పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఆభ‌ర‌ణాలు అమ్మేస్తున్న ప్ర‌జ‌లు

పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఆభ‌ర‌ణాలు అమ్మేస్తున్న ప్ర‌జ‌లు

హైద‌రాబాద్‌: థాయిలాండ్‌లో ప్ర‌స్తుతం గోల్డ్ ర‌ష్ న‌డుస్తోంది. త‌మ ద‌గ్గ‌ర ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌ను ప్ర‌జ‌లు అమ్మేస్తున్నారు. ఎగ‌బ‌డి మ‌రీ దూకాణాల వైపు దూసుకువెళ్తున్నారు.  బ్యాంకాక్‌లో ఉన్న జ్వ‌ల‌రీ షాపుల వ‌ద్ద .. భారీ క్యూలైన్లు ఉన్నాయి.  దాదాపు ఏడేళ్ల త‌ర్వాత ఆ దేశంలో బంగారు ధ‌ర‌లు పెరిగాయి.  15 గ్రాముల బంగారం ఇప్పుడు అక్క‌డ 26వేల బాత్‌లు ప‌లుకుతోంది.  అంటే మ‌న క‌రెన్సీలో దాని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుంది.  ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఆదాయం కోల్పోయారు. దీంతో త‌మ ద‌గ్గ‌ర ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల‌ను అమ్మేసి ఆ డ‌బ్బును సొంతం చేసుకోవాల‌నుకుంటున్నారు.  జ్వ‌ల‌రీ షాపుల వ‌ద్ద న‌గ‌దు త్వ‌ర‌గా అయిపోతుంద‌న్న భ‌యంతో.. జ‌నం ఒక్క‌సారిగా షాపుమీద ప‌డ్డారు.  ప్ర‌ధాని ప్ర‌యుత్ చాన్ స్పందిస్తూ.. ప్ర‌జ‌లు నెమ్మ‌దిగా ఆభ‌ర‌ణాలు అమ్ముకోవాలంటూ కోరారు. కానీ జ్వ‌ల‌రీ షాపుల వ‌ద్ద మాత్రం సోష‌ల్ డిస్ట‌న్సింగ్ రూల్ అదుపుత‌ప్పింది.logo