శనివారం 11 జూలై 2020
International - Jun 15, 2020 , 18:30:58

థాయ్‌లాండ్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

థాయ్‌లాండ్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

బ్యాంకాక్‌ : కరోనా వైరస్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 21 రోజుల్లో స్థానికంగా ఒక్క కేసు నమోదు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సుమారు 13 మిలియన్ల జనాభా కలిగిన ఈ ఆగ్నేయాసియా దేశంలో జనవరి 13న తొలి కొవిడ్‌ కేసు నమోదవగా, ఇప్పటి వరకు 3,135 మంది వైరస్‌ బారినపడగా.. 58 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు మూడు నెలల తర్వాత అనంతరం కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు థాయ్ ప్రభుత్వం పేర్కొంది. అలాగే రెస్టారెంట్లు తెరిచేందుకు, మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లలోకి పంపిస్తున్నామని, ప్రస్తుతం అక్కడి నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.


logo