ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Sep 19, 2020 , 16:18:26

ఇక్కడ చెత్త కింద పడేస్తే.. ప్యాక్‌ చేసి ఇంటికి పంపుతారు..!

ఇక్కడ చెత్త కింద పడేస్తే.. ప్యాక్‌ చేసి ఇంటికి పంపుతారు..!

బ్యాంకాక్‌: అనేక పర్యాటక ప్రదేశాల్లో చెత్త అనేది ప్రధాన సమస్య. పార్కులలో కొందరు చెత్తను డస్ట్‌బిన్‌లో కాకుండా బయట పడేస్తుంటారు. గోడలపై ఎన్ని సూచనలు రాసిపెట్టినా పట్టించుకోరు. అయితే, దీనికి ఓ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది థాయ్‌లాండ్‌ ప్రభుత్వం. ఎవరు చెత్త వేస్తున్నారో గుర్తించి, దాన్ని ప్యాక్‌ చేసి వారి ఇంటికి డెలివరీ చేసేలా నిర్ణయం తీసుకుంది. 

బ్యాంకాక్ సమీపంలోని ఖావో యాయ్ నేషనల్ పార్క్ ఇందుకు సిద్ధమైంది. చెత్త పడేసిన వారిని గుర్తించారు. చెత్తను ప్యాక్‌ చేసి దానిపై ’ఇది మీ వస్తువు.. మా పార్కులో మరిచిపోయారు’ అని రాస్తున్నారు. ఈ పార్సిల్‌ చూసైనా మరోసారి వారు ఇలాంటి పనులు చేయరని అధికారులు భావిస్తున్నారు. అలాగే, వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ఇందుకోసం పార్కుకు వచ్చే సందర్శకుల చిరునామాలను నమోదు చేసుకుంటున్నారు. కాగా, పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో పడేసిన చెత్తను వారివారి ఇళ్లకు పంపేందుకు కాటన్లను రెడీ చేశామని, త్వరలోనే పంపించనున్నామని ఆ దేశ పర్యావరణ మంత్రి వరవుత్ సిల్పా ఆర్చా ధ్రువీకరించారు. రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్న కార్డ్‌బోర్డ్‌ కాటన్ల ఫొటోలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.  జాతీయపార్కుల్లో చెత్తాచెదారం వేయడం నేరమని, ఐదేళ్ల వరకు భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష ఉంటుందని హెచ్చరించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo