గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 15:28:02

అత‌ని కడుపులో 17 అడుగుల 'ఏలికపాము'‌.. ఆశ్చ‌ర్య‌పోయిన వైద్యులు

అత‌ని కడుపులో 17 అడుగుల 'ఏలికపాము'‌.. ఆశ్చ‌ర్య‌పోయిన వైద్యులు

తీవ్ర‌మైన క‌డుపు నొప్పితో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి 17 అడుగుల పొడ‌వున్న ఎల్లో టేప్‌వార్మ్‌ను బ‌య‌ట‌కు తీశారు.  అస‌లు టేప్‌వార్మ్ అంటే ఏంటో తెలుసా? మ‌నుషులు, జంతువుల ప్రేగు లోప‌ల నివ‌సించే ఒక ర‌క‌మైన‌ ఏలిక‌పాములు. ఇవి మానవ శ‌రీరంలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు అనేక జీవ‌సంబంధ స‌మ‌స్య‌లు క‌లిగిస్తాయి. దీనిని టేప్‌వార్మ్ ఇన్‌ఫెక్ష‌న్ అని అంటారు. ఈ స‌మ‌స్య ఉన్న‌ప్పుడు వాంతులు, వికారం, బ‌ల‌హీన‌త‌, అల‌స‌ట‌, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఎక్కువ‌గా పంది మాంసం, గొడ్డు మాంసం తినేవారికి ఈ ఇన్‌ఫెక్ష‌న్ సోకుతుంది. 

థాయ్‌లాండ్‌లోని నాఖోన్ సావాన్‌కు చెందిన డుయాంగ్‌చ‌న్ డాచోడ్డే అనే 43 ఏండ్ల వ్య‌క్తి విప‌రీత‌మైన క‌డుపునొప్పికి గుర‌య్యాడు. దీంతో అత‌ను మ‌ల‌విస‌ర్జ చేయ‌డానికి వెళ్లాడు. అప్పుడు అత‌ను 17 అడుగుల పొడ‌వున్న టేప్‌వార్మ్‌ను గుర్తించాడు. ఇది ప‌సుపురంగులో ఉంది. దీనిని డాక్ట‌ర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. దీనిని గొడ్డుమాంసం టేప్‌వార్మ్‌గా వైద్యులు గుర్తించారు. దీనిని టైనియా సాగినాటా అని పిలుస్తారు. ప‌చ్చిమాంసం తిన‌డం వ‌ల్ల అత‌ని శ‌రీరం లోప‌ల ఈ పురుగు పెరిగింద‌ని వైద్యులు వెల్ల‌డించారు. అయితే ఇది బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అత‌ని క‌డుపు బాగానే ఉన్న‌ట్లు తెలిపారు. కానీ క‌డుపులో ఇంకా పురుగులు ఉన్నాయ‌ని తెలిసి భ‌యం వేస్తుంది అని వాపోయాడు డుయాంగ్‌చ‌న్‌. 


logo