గురువారం 04 జూన్ 2020
International - May 05, 2020 , 16:09:40

బొప్పాయి పండు, మేకకు కరోనా పాజిటివ్!

బొప్పాయి పండు, మేకకు కరోనా పాజిటివ్!

హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచం నలువైపులా విస్తరించింది. ప్రపంచ దేశాలను ఈ వైరస్ గజగజ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తికి పకడ్బందీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. అది మాత్రం కోరలు చాస్తుంది. కరోనా వైరస్ మనషులకు సోకడం చూశాం. మనషుల నుంచి పెంపుడు జంతువులకు కరోనా వ్యాపించడం విన్నాం. కానీ విచిత్రమేమంటే.. బొప్పాయి పండు, మేకకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు టాంజానియా దేశంలో వార్తలు గుప్పుమన్నాయి.  

టాంజానియా దేశంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ పరీక్షల కోసం టెస్టు కిట్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది టాంజానియా. అయితే ఈ టెస్టు కిట్లు నాణ్యతతో కూడినవా? లేదా? అనే అంశాలను టాంజానియా వైద్యాధికారులు పరీక్షించారు. మనషులతో పాటు బొప్పాయి, మేక, గొర్రెలపైనా పరీక్షించారు. గొర్రెకు మినహా మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా వైరస్ టెస్టు కిట్లలో నాణ్యతా లోపం కారణంగానే మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న టెస్టు కిట్లలో సాంకేతిక లోపాలు ఉన్నాయని టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి పేర్కొన్నారు. ఈ టెస్టు కిట్ల వాడకాన్ని నిలిపివేస్తూ ద‌ర్యాప్తుకు ఆదేశించారు టాంజానియా అధ్యక్షుడు. 


logo