గురువారం 04 జూన్ 2020
International - May 09, 2020 , 11:26:23

తెరుచుకోని టెస్లా ప్లాంట్‌.. ఎల‌క్ట్రిక్ కార్ల ఉత్ప‌త్తి నిలిపివేత‌

తెరుచుకోని టెస్లా ప్లాంట్‌.. ఎల‌క్ట్రిక్ కార్ల ఉత్ప‌త్తి నిలిపివేత‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ ధాటికి దాదాపు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని కార్ల కంపెనీలు తమ ఉత్ప‌త్తుల్ని నిలిపివేశాయి. ప్ర‌స్తుతం అమెరికాలోనూ ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా కూడా త‌మ ఉత్ప‌త్తుల‌ను ఆపేసింది.  కాలిఫోర్నియాలోని ప్ర‌ధాన ప్లాంట్‌లో ప‌నుల‌ను నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఆ రాష్ట్రంలో వైర‌స్ కేసులు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో.. ఉత్ప‌త్తిని కొన‌సాగించ‌వ‌ద్దు అంటూ ఆదేశించారు. వాస్త‌వానికి శుక్ర‌వారం నుంచి కార్ల ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌ని టెస్లా ఓన‌ర్ ఎల‌న్ మ‌స్క్ తెలిపారు.  శాన్‌ఫ్రాన్సిస్‌కో స‌మీపంలో ఉన్న ఫ్రెమంట్ ఫ్యాక్ట‌రీలో స్వ‌ల్ప స్థాయిలో ఉత్ప‌త్తి ప్రారంభం అవుతుంద‌న్నారు. కానీ వైర‌స్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో ఆ కంపెనీకి ప‌చ్చ‌జెండా ఇవ్వలేదు.  ప్లాంట్‌లో ప‌నులు ప్రారంభిస్తే మ‌ళ్లీ కేసులు ఎక్కువ అవుతాయ‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  శాన్‌ఫ్రాన్సిస్‌కో బే ఏరియా స‌మీపంలో సుమారు 9500 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  వైర‌స్ వ‌ల్ల 342 మంది చ‌నిపోయారు. ఫ్రెమంట్ ఫ్యాక్ట‌రీలో మార్చి 23 నుంచి ఉత్ప‌త్తి నిలిపివేశారు. అక్క‌డ సుమారు ప‌ది వేల మంది కార్మికులు ప‌నిచేస్తుంటారు. ప్ర‌తి ఏడాది 4 ల‌క్ష‌ల కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తారు. logo