శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 03, 2020 , 02:21:57

కాబూల్‌ యూనివర్సిటీపై ఉగ్రదాడి

కాబూల్‌ యూనివర్సిటీపై ఉగ్రదాడి

  • 25 మంది మృతి

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. దేశంలోనే అతి పెద్ద విద్యాసంస్థ అయిన కాబూల్‌ యూనివర్సిటీలోకి సోమవారం తుపాకులు, రైఫిళ్లతో ప్రవేశించిన ముగ్గురు దుండగులు దొరికిన వాళ్లను దొరికినట్టు కాల్చి చంపారు. సుమారు ఐదు గంటలపాటు కొనసాగిన ఈ మారణ హోమంలో దాదాపు 25 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. మృతుల్లో విద్యార్థులు కూడా ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకొని ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఘటనకు బాధ్యతవహిస్తూ ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘటనతో తమకెలాంటి సంబంధంలేదని తాలిబన్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌నే ఈ ఘటనకు కారణం కావచ్చన్న అనుమానాలున్నాయి.