గురువారం 26 నవంబర్ 2020
International - Nov 02, 2020 , 14:32:56

కాబూల్‌ వర్సిటీ సమీపంలో ఉగ్రదాడి, పేలుడు

కాబూల్‌ వర్సిటీ సమీపంలో ఉగ్రదాడి, పేలుడు

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి. కాబూల్ విశ్వవిద్యాలయం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాద దాడిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో యూనివర్శిటీ ప్రాంగణం దద్దరిల్లింది. కాబూల్ యూనివర్శిటీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, దాడి చేసిన వారి గురించి ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం లేదు. దాడి చేసిన వారు ఎంత మంది అనేది కూడా స్పష్టంగా లేదు. ప్రాణనష్టం ఎంత జరిగింది అనేది కూడా ఇంకా తెలియరాలేదు. భద్రతా దళాలు యూనివర్శిటీ ప్రాంగణాన్ని చుట్టుముట్టాయి. 

2018 లో కాబూల్‌లోని పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడులో 14 మంది మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడానికి వ్యతిరేకంగా ఈ దాడి జరిగినట్లు ప్రభుత్వం భావిస్తున్నది. మతాధికారుల బృందం విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున గుమిగూడటాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి జరిగినట్లు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. 2020 మార్చి నెలలో కాబూల్‌లోని సిక్కు మత సముదాయంపై ముష్కరులు, ఆత్మాహుతి దళాలు కాల్పులు జరుపగా 11 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అలాగే, గత జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌లోని గర్హ్వాలే గ్రీన్‌ జోన్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ప్రసిద్ధ ఇమామ్ కూడా ఉన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.