బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 32 మంది దుర్మరణం

బ్రసిలియా : దక్షిణ బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అతివేగంగా వచ్చిన ట్రక్కు నేరుగా ఢీకొట్టడంతో 32 మంది దుర్మరణం చెందగా.. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్వోపౌలో రాష్ట్రంలో టగ్వాయ్ పట్టణ సమీపంలో టగ్వాయ్-తక్వరితుబా రహదారిపై ఉదయం 7 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 53 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్రమాద ధాటికి మృతదేహాలు చిన్నభిన్నమవడంతో వాటిని బయటకు తీసి దవాఖానకు తరలించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ప్రమాదం కారణంగా రహదారిపై దాదాపు 4 గంటలపాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. చనిపోయిన 32 మందికి సంతాపంగా టగ్వాయ్ మున్సిపాలిటీ మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి