బుధవారం 03 జూన్ 2020
International - May 01, 2020 , 12:17:44

10 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు..

10 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు..


హైద‌రాబాద్‌: ప్ర‌పంచ వ్యాప్తంగా నోవెల్ క‌రోనా వైర‌స్ మ‌హాబీభ‌త్సం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ వైర‌స్ బారినప‌డ్డ వారిలో సుమారు 10 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు.  ఈ విష‌యాన్ని జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ త‌న డేటాలో పేర్కొన్న‌ది.  అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ.. వైర‌స్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు డేటాబేస్‌ను అప్‌డేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు  32 ల‌క్ష‌ల 58 వేల మందికి వైర‌స్ సోక‌గా, రెండు ల‌క్ష‌ల 34 వేల మంది మ‌ర‌ణించారు. అయితే కోలుకున్న‌వారి సంఖ్య కూడా ప‌ది ల‌క్ష‌లు దాట‌డం విశేషం. అధికారికంగా ప‌ది ల‌క్ష‌లే దాటినా.. ఆ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. ఇన్‌ఫెక్ష‌న్ అయిన వారికి, రిక‌వ‌రీ అయిన వారికి ఇంకా చాలా తేడా క‌నిపిస్తున్న‌ది.logo