ఆదివారం 31 మే 2020
International - Apr 30, 2020 , 20:30:29

ఇరాక్‌లో తెలంగాణవాసుల ఇక్కట్లు

ఇరాక్‌లో తెలంగాణవాసుల ఇక్కట్లు

హైదరాబాద్‌ : బ్రతుకు దెరువును వెతుక్కుంటూ పరాయి దేశం వెళ్లిన వలస జీవులపై కరోనా కాటు పడింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రం నుంచి ఇరాక్‌కు వెళ్లిన 50 మంత్రి ఈ విపత్కర కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లికి చెందిన బండారి రాజశేఖర్‌తో పాటు జగిత్యాల, నిజామాబాద్‌కు చెందిన 40 మందికి పైగా తెలంగాణ వాసులు అక్కడ తినడానికి తిండిలేక అవస్తలు పడుతున్నారు. కొన్ని నెలల క్రితం విజిట్‌ వీసాలపై వెళ్లిన వీరంతా కుర్దిస్తాన్‌ రాష్ట్రంలోని ఎర్బీల్‌ పట్టణంలో ఉన్న వివిధ కంపెనీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీలు మూతపడటంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దయనీయ స్థితిలో వీరు 200 కిలోమీటర్లు నడిచి సేలామాని ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు దయార్థ హృదయులు స్పందించి ఆశ్రయం కల్పించి భోజన సౌకర్యం కల్పించారు. ప్రభుత్వం కనికరించి ఎలాగైనా తమను తెలంగాణకు తీసుకువెళ్లాల్సిందిగా వేడుకుంటున్నారు.


logo