గురువారం 04 జూన్ 2020
International - Apr 28, 2020 , 19:01:43

కరోనా విపత్తులో తెలంగాణ ఎన్నారై సంఘాల ఆసరా

కరోనా విపత్తులో తెలంగాణ  ఎన్నారై  సంఘాల ఆసరా

కరోనా మహమ్మారి వల్ల యావత్‌ దేశం లక్డౌన్‌ అయింది. దీంతో ఎంతో మంది పేదలు, రోజువారి కూలీతో జీవనం సాగించే వారికి ఎంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ఇలాంటి వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేబట్టిన వివిధ  సహాయ కార్యక్రమాల్లో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు.  ఆర్థికశాఖ మంత్రి శ్రీ  హరీష్ రావుకు తెలంగాణ ఎన్నారై ఫోరమ్  సిద్దిపేటలో లక్ష రూపాయలు చెక్ అందచేశారు .  కరోనా పై పోరాటం పై హరీష్ రావు  నిరంతర శ్రమకి స్ఫూర్తితో వారికీ తోడ్పాటుగా మా వంతు సహాయం చేస్తున్నామని   తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, ఫౌండర్ వేణుగోపాల్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి ,రంగు వెంకట్ ,మహేష్ జమ్మల  సంయుక ప్రకటనలో తెలిపారు.  

లండన్లో విద్యార్థులకు ఆసరాగా..

గత  39 రోజులుగా  వివిధ తెలుగు, తెలంగాణ, సేవ సంఘాల ఐక్యవేదిక ద్వారా యూకే  విమానాశ్రయంలో చిక్కుకున్నవిద్యార్థులకు వసతి, భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  దాదాపు  150  మంది విద్యార్థులకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ప్రమోద్‌ గౌడ్‌ చెప్పారు.  ఈ విషయాలను   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  భారత రాయబారి కార్యాలయం అధికారులకు వివరించామని ఆయన అన్నారు.  తెలంగాణ ఎన్నారై ఫోరమ్, టీడీఫ్, తాల్, యుక్త, జాగృతి, వాసవి క్లబ్, హైదరాబాద్ బావార్చి, ఒయాసిస్ అకౌంట్స్, తుకారాం రెడ్డి, ఉదయ్ నాగరాజు, గోలి తిరుపతి. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక అధికారి  కందుల రవీంద్ర రెడ్డిలతో కలిసి ఈ సహాయ కార్యక్రమాలను చేస్తున్నట్లు వారు వివరించారు.logo