సోమవారం 01 జూన్ 2020
International - Apr 18, 2020 , 18:47:47

కువైట్‌లోని వలస కార్మికులకు అండగా తెలంగాణ జాగృతి

కువైట్‌లోని వలస కార్మికులకు అండగా తెలంగాణ జాగృతి

కరోనా ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని మాజీ ఎంపీ కవిత ఇవ్చిన పిలుపు మేరకు, గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికులకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు. కరోనా ప్రభావంతో కువైట్ లో‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ కార్మికులకు ఆపన్న హస్తం అందించింది తెలంగాణ జాగృతి. ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో పస్తులుంటున్న కార్మిక కుటుంబాలకు తెలంగాణ జాగృతి కువైట్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు.  తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 200 కుటుంబాలు కువైట్ లో వివిధ రంగాలలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ఏర్పడిన సంక్షోభానికి, కువైట్ లో ఉన్న వలస కార్మికులు సైతం ఉపాధి కోల్పోయి తోవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి కువైట్ శాఖ అధ్యక్షులు వినయ్ ముత్యాల, కార్మిక కుటుంబాలకు సహాయం చేయడానికి నిర్ణయించారు. తెలంగాణ జాగృతి గల్ఫ్  అధ్యక్షులు సీహెచ్ హరిప్రసాద్ సహకారంతో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. అంతేకాదు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని తెలంగాణ జాగృతి కువైట్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కువైట్ శాఖ అధ్యక్షులు వినయ్ ముత్యాల, ప్రమోద్ కుమార్ మార్క తదితరులు పాల్గొన్నారు.logo