గురువారం 04 జూన్ 2020
International - Apr 03, 2020 , 15:55:52

ఆస్ట్రేలియాలో తెలంగాణ జాగృతి సరుకుల పంపిణీ

ఆస్ట్రేలియాలో తెలంగాణ జాగృతి సరుకుల పంపిణీ

హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు అన్ని దేశాలకు కరోనా చాపకింద నీరులా విస్తరించింది. దీంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాలో చిక్కుకున్న అంతర్జాతీయ విద్యార్థులకు తెలంగాణ జాగృతి నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ సరుకులు కొద్ది వారాల పాటు విద్యార్థులకు ఉపయోగపడనున్నాయి. ఎవరికైనా సహాయం కావాలనుకుంటే 0406969095 నంబర్‌కు కాల్‌ చేయాలని తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ ప్రెసిడెంట్‌ శ్రీకర్‌ రెడ్డి అందేం, సభ్యుడు నిఖిల్‌ రెడ్డి కోరారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని వారు పిలుపునిచ్చారు. logo