మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Mar 11, 2020 , 14:48:51

ఒమన్‌లో అట్టహాసంగా ‘తెలంగాణ క్రికెట్‌ టోర్నమెంట్‌’..

ఒమన్‌లో అట్టహాసంగా ‘తెలంగాణ క్రికెట్‌ టోర్నమెంట్‌’..

మస్కట్‌: ఒమన్‌ దేశంలో తెలంగాణ క్రికెట్‌ టోర్నమెంట్‌ అట్టహాసంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ ఒమన్‌, తెలంగాణ జాగృతి ఒమన్‌ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీని ప్రత్యేకించి తెలంగాణ వాసుల కోసం నిర్వహించారు. టోర్నీ ప్రారంభానికి ముందుగా ఇటీవల మరణించిన ఒమన్‌ రాజు సుల్తాన్‌ కాబూస్‌కు నివాళి అర్పించారు. కాగా, ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పోటీపడ్డాయి. టోర్నీలో డక్కన్‌ ఛాంపియన్స్‌ జట్టు విజేతగా నిలవగా, తెలంగాణ వారియర్స్‌ జట్టు రన్నరప్‌ నిలిచింది. ముఖ్య అతిథిగా హాజరైన హాయ వాటర్‌ కంపెనీ సీఈఓ హుస్సేన్‌ హసన్‌ అలీ, విశేష అతిథిగా హాజరైన ఇండియన్‌ సోషల్‌ క్లబ్‌ స్పోర్ట్స్‌ సెక్రటరీ సోహైల్‌ ఫైనల్లో పోటీ పడ్డ జట్లకు ట్రోఫీలు అందజేశారు. 

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఒమన్‌ శాఖ అధ్యక్షులు మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఒమన్‌లో వివిధ ప్రాంతాల్లో నివసించే తెలంగాణ వాసులను ఒక చోట చేర్చేందుకు ప్రతి యేటా క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతమవడానికి కృషి చేసిన స్పాన్సర్లకు, నిర్వాహకులకు, టోర్నీలో పాల్గొన్న జట్ల సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఒమన్‌ శాఖ అధ్యక్షులు గుండు రాజేందర్‌, కోర్‌ కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఒమన్‌ శాఖ కోర్‌ కమిటీ సభ్యులు.. షేక్‌ అహ్మద్‌, సత్యనారాయణ, కరుణాకర్‌, ప్రవీణ్‌ కుమార్‌, రాజేందర్‌ రెడ్డి, రవి, సాయి కుమార్‌ చౌదరి, రాజేందర్‌, ఆంజనేయులు, అనిల్‌, ఇమామ్‌, బల్ల శ్రీనివాస్‌, వినోద్‌, తిరుపతి యాదవ్‌, రాజ్‌ కుమార్‌ రెడ్డి, అజయ్‌ అక్కినపల్లి, జగదీష్‌, వీరేందర్‌, లక్ష్మణ్‌, అజయ్‌, కిరణ్‌, సుధీర్‌ రెడ్డి, రఘు, మధు తదితరులు పాల్గొన్నారు.  


logo