మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 12:31:47

చికెన్‌ ఫిల్లెట్‌ తింటున్నా అనగానే.. కోమా నుంచి లేచిన యువకుడు

చికెన్‌ ఫిల్లెట్‌ తింటున్నా అనగానే.. కోమా నుంచి లేచిన  యువకుడు

బ్యాంకాక్‌ : మీకు జీవితాంతం ప్రతిరోజూ తినగలిగే అభిమాన ఆహారం ఉందా? మంచి నిద్ర నుంచి గానీ, కోమా నుంచి గానీ మిమ్మల్ని మేల్కొలపగలదని మీరు నమ్ముతున్న ప్రత్యేక వంటకం ఏదైనా మీకు ఉన్నదా?  ఆహారం ప్రజల మానసిక స్థితిని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనేది ముమ్మాటికి వాస్తవం. అయితే, తైవాన్‌లో ఒక విచిత్రమైన కేసు విషయంలో ఆహారం పెద్ద అద్భుతాలు చేయగలదని నిరూపితమైంది. 62 రోజులపాటు కోమాలో ఉన్న ఓ 18 ఏండ్ల యువకుడు.. తనకు ఇష్టమైన వంటకం- చికెన్ ఫిల్లెట్స్ గురించి సోదరుడు ప్రస్తావించగానే లేచి కూర్చున్నాడు.

వాయవ్య తైవాన్‌కు చెందిన చియు అనే 18 ఏండ్ల యువకుడు ఇటీవల స్కూటర్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాంతక గాయాలు, అనేక అంతర్గత అవయవాలలో తీవ్ర రక్తస్రావం జరుగడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ యువకుడు హిన్చు కౌంటీలోని టన్ యెన్ జనరల్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నాడు.  యువకుడు ప్లీహం, కుడి మూత్రపిండం, కాలేయం తీవ్రంగా గాయపడటంతోపాటు పలు గాయాలకు గురయ్యాడని, ఉదర కుహరం పగుళ్లు నుంచి రక్తస్రావం జరిగిందని ఐసియు డైరెక్టర్ హ్సీహ్ సుంగ్-హ్సిన్ చెప్పారు. అన్ని రోగ నిర్ధారణల తరువాత చియుకు ఆరు ఆపరేషన్లు జరిగాయి. క్రానియోటమీ, లాపరోటోమీ, కుడి మూత్రపిండ నెఫ్రెక్టోమీ, స్ప్లెనెక్టోమీ, కాలేయ మరమ్మతు, రైట్‌ క్లావికిల్, కుడి ఎముక ఓపెన్ తగ్గింపు, అంతర్గత స్థిరీకరణ వంటి  ఆపరేషన్లు జరిగాయి. అయినప్పటికీ దురదృష్టవశాత్తు అతను ఇంకా కోమా నుంచి కోలుకోవడం లేదు.

అతని కుటుంబం నిరంతరం దవాఖానలోనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. 62 వ రోజులుగా కోమాలో ఉండగా.. చియు సోదరుడు దవాఖానను సందర్శించి, "బ్రో నేను నీకిష్టమైన చికెన్ ఫిల్లెట్ తినేందుకు వెళ్తున్నాను" అని సరదాగా చెప్పాడు. తనకిష్టమైన ఆహారం గురించి సోదరుడు ప్రస్తావించడంతో అతను స్పృహలోకి వచ్చి పల్స్ వేగవంతం కావడం వంటి మాయాజాలం వలె పనిచేసింది. ఆ యువకుడు తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. చికెన్‌ ఫిల్లెట్‌ వంటకం యువకుడిని కోమా నుంచి బయటకు రప్పించడంతో ఇప్పుడా వంటకానికి తైవాన్‌లో విపరీతమైన డిమాండ్‌ పెరిగిందంట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.