శనివారం 08 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 01:24:10

దశాబ్దాల పాటు కరోనా ప్రభావం!

దశాబ్దాల పాటు కరోనా ప్రభావం!

  • డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌

జెనీవా: కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంపై దశాబ్దాల పాటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అన్నారు. ఇలాంటి మహమ్మారులు వందేండ్లకు ఒకసారి వస్తాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా మందికి కరోనా ముప్పు పొంచి ఉన్నదని, ఇప్పటికే తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వైరస్‌ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. శుక్రవారం సంస్థ అత్యవసర విభాగం సమావేశమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 


logo