శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 22, 2020 , 13:53:48

పాక్ ప్రభుత్వం పై టెక్ దిగ్గజాలు ఆగ్రహం...

పాక్ ప్రభుత్వం పై టెక్ దిగ్గజాలు ఆగ్రహం...

ఢిల్లీ :పాకిస్తాన్ కొత్త సోషల్ మీడియా నిబంధనలపై టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చట్ట విరుద్ధమైన ఆన్‌లైన్ కంటెంట్ ( ప్రొసీజర్, ఓవర్ నైట్ సేఫ్ గార్డ్స్) రూల్స్ ( ఆర్బీయు ఓసీ) 2020 ప్రకారం తొలగించడం, బ్లాక్ చేయడంపై కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఈ రూల్స్‌ను ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్ యాక్ట్ 201(పీ ఈసిఏ) కింద సిద్ధం చేశారు. ఆర్బీయు ఓసీ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్ని అంశాలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ( ఐఎస్పీ) వర్తింపచేశారు. ఇది టెక్ దిగ్గజాలకు ఆగ్రహం కలిగించింది.

పాక్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన సోషల్ మీడియా నిబంధనలు ఆసియా ఇంటర్నెట్ కొలేషన్ (ఏఐసీ)కి ఆగ్రహం తెప్పించింది. ఏఐసీలో ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం తాజా నిబంధనలు సమీక్షించాలని లేదంటే ఇంటర్నెట్ సేవలు కొనసాగించడం కష్టతరం అవుతుందని చెబుతున్నాయి. నిబంధనలు సమీక్షించకుంటే సేవలను నిలిపివేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించాయి. పాక్ కొత్త నిబంధనలు చాలా ఆందోళకరంగా ఉన్నట్లు తెలిపింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.