బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 14:06:42

త‌ర‌గ‌తి గ‌దిని రైలుగా మార్చిన మాస్టారు‌.. క‌రోనా భ‌యమేన‌ట‌!

త‌ర‌గ‌తి గ‌దిని రైలుగా మార్చిన మాస్టారు‌.. క‌రోనా భ‌యమేన‌ట‌!

ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో కోవిడ్‌-19 డివైడర్లను రైలుగా మార్చాడు. దీంతో విద్యార్థులు పాఠ‌శాల‌కు వెళ్లిన‌ప్పుడు భ‌య‌ప‌డ‌కుండా కూర్చోవ‌చ్చు. కరోనా రాక‌తో పాఠ‌శాల‌ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో స్కూల్ తెర‌వ‌డానికి ఇంకా అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఐదు నెల‌ల నుంచి పిల్ల‌లు ఇంట్లోనే ఉండ‌డంతో పాఠ‌శాల‌లు తిరిగి తెర‌వాల‌ని ప్ర‌తిఒక్క‌రూ అనుకుంటున్నారు. కానీ మ‌రొక భ‌యం త‌ల్లిదండ్రుల‌ను వెంటాడుతున్న‌ది. స్కూల్‌కు వెళ్లిన‌ప్పుడు పిల్ల‌లు ప‌క్క‌ప‌క్క‌నే కూర్చోవ‌డం వ‌ల్ల ఎక్క‌డ వైర‌స్ సోకుతుందో అని భ‌య‌ప‌డుతున్నారు.

అలాంటి భ‌యాన్ని పోగొట్ట‌డానికి ఓ మాస్టారు మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. సామాజిక దూరాన్ని పాటించేలా అనేక పాఠ‌శాల‌లు ఇద్ద‌రు విద్యార్థుల డెస్క్‌ల మ‌ధ్య పార‌ద‌ర్శ‌క తెర‌ల‌ను ఏర్పాటు చేశాయి. ఈ కొత్త త‌ర‌గ‌తుల వాతావ‌ర‌ణాన్ని పిల్ల‌ల‌కు అల‌వాటు చేయ‌డానికి వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు ఓ ఉపాధ్యాయుడు. త‌ర‌గ‌తి గ‌దిని చిన్న రైలులా క‌నిపించేలా అలంక‌రించారు. ఇది పార‌ద‌ర్శ‌క తెర‌ల‌తో కూడిన డెస్కులుగా చూపిస్తుంది. ఈ వీడియోను అమెరిక‌న్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. అంతేకాదు దీనిని 3.1 మిలియ‌న్ల‌కు పైగా వీక్షించారు. 


logo