మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 13:55:40

ఒళ్లంతా టాటూలు వేసుకున్న ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊడింది..!

ఒళ్లంతా టాటూలు వేసుకున్న ఉపాధ్యాయుడి ఉద్యోగం ఊడింది..!

పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు చాలా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే పిల్ల‌లు టీచ‌ర్ చెప్పే పాఠాల‌నే కాదు, ఆయ‌నను అనుస‌రిస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు ఎంత మంచిగా ఉంటే విద్యార్థులు కూడా అంత బాగుంటార‌ని అనుకుంటారు పిల్ల‌ల త‌ల్లిదండ్రులు. కానీ ఈ ఉపాధ్యాయుడు మాత్రం ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా శ‌రీర‌మంతా ప‌చ్చ‌బొట్లు పొడిపించుకున్నాడు. చివ‌రికి కంట్లోని తెల్ల గుడ్డును కూడా తొలిగించుకున్నాడు. అత‌ని అవ‌తారం చూసిన పిల్ల‌ల త‌ల్లిదండ్రులు అత‌నిపై ఫిర్యాదు చేశారు. దీంతో అత‌నిని ఉద్యోగంలోనుంచి తీసేశారు.

సిల్వైన్ అనే ఉపాధ్యాయుడు ఫ్రాన్స్‌, ప‌లైసేలోని డాక్టూర్ మోరే ఎలిమెంట‌రీ స్కూల్లో  ప‌నిచేస్తున్నాడు. త‌ల నుంచి కాలి వ‌ర‌కు టాటూలు వేపించుకున్నాడు. దీంతో అత‌నిని ఫ్రెంచ్ కిండర్ గార్టెన్లో బోధించకుండా నిరోధించారు. 35 ఏండ్ల ఉపాధ్యాయుడు ఆరేండ్ల నుంచి ఎక్కువ వ‌య‌సున్న పిల్ల‌ల‌కు బోధిస్తాడు. 'త్వ‌ర‌లో త‌న ప్రొఫెష‌న్‌ను మ‌ళ్లీ కొన‌సాగిస్తానంటున్నాడు. పిల్ల‌ల‌కు, నాకు మధ్య మంచి బంధం ఉంది. వారి త‌ల్లిదండ్రులు కూడా నాతో బాగుంటారు. దూరం నుంచి చూసిన‌ప్పుడు న‌న్ను త‌ప్పుగా అనుకోవ‌చ్చు' అని టీచ‌ర్ చెప్పుకొచ్చారు. ఇత‌నికి 27 ఏండ్ల వ‌య‌సు నుంచే టాటూల మీద ఇష్టం ఏర్ప‌డింది. ఎనిమిది ఏండ్ల‌లో అత‌ని చెవులు, నాలుక‌తో స‌హా దాదాపు మొత్తం శ‌రీరాన్ని సిరాతో క‌ప్పేశాడు. ఈ విధంగా శ‌రీర‌మంతా ప‌చ్చ‌బొట్లు వేపించుకున్న వాళ్ల‌ని సోష‌ల్ మీడియాలో చాలామందినే చూశాం.  


logo