శనివారం 06 జూన్ 2020
International - Apr 29, 2020 , 14:05:01

ఒంటిపై రోజుకో టాటూ.. ఇకలేదు చోటు!

ఒంటిపై రోజుకో టాటూ.. ఇకలేదు చోటు!

క‌రోనా వైర‌స్ విజృంభణతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపుగా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. బోర్‌ కొట్టకుండా ఉండేందుకు ఎవరికి తోచింది వారు చేస్తున్నారు.  డ్యాన్స‌ర్లు ఇంట్లో వాళ్ల‌కు డ్యాన్స్ నేర్పిస్తే, క్రీడాకారులు ఇంటినే గ్రౌండ్‌గా మార్చుకుంటున్నారు. సెల‌బ్రిటీలు వంట‌లు, యోగాలు, వ్యాయామాలంటూ చేస్తూ సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లండ‌న్‌కు చెందిన ఓ టాటూ ఆర్టిస్ట్‌ తనకు వచ్చింది తాను చేస్తూ లాక్‌డౌన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు.

ఇత‌నో ఫేమ‌స్ టాటూ ఆర్టిస్ట్. రోజుకు ఒక టాటూ వేయ‌క‌పోయినా అత‌నికి ముద్ద దిగేది కాదు. అలాంటిది లాక్‌డౌన్‌లో టాటూ కావాలంటూ ఇత‌ని వ‌ద్ద‌కు ఎవ‌రు వ‌స్తారు చెప్పండి. ఎవ‌రి దగ్గరికి వెళ్తే ఎక్క‌డ క‌రోనా వ‌స్తుందో అని ఎక్క‌డివాళ్ల‌క్క‌డ దాక్కుంటున్నారు. అందుకే ఎవ‌రికో కాకుండా త‌న‌కే టాటూ వేసుకోవాల‌నుకున్నాడు. ఈ విధంగా లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి రోజుకో టాటూ వేసుకుంటూ ఉన్నాడు. 

చెట్టు, ప‌క్షులు, జంతువులు, గంట‌, ఓం వంటి బొమ్మ‌ల‌ను టాటూలుగా మ‌లుచుకున్నాడు. శ‌రీరం అంతా నిండిపోయింది కానీ లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది... శ‌రీరం మొత్తం టాటూలతో నిండిపోయింది.. చివ‌రికి అరికాలును కూడా వ‌ద‌ల్లేదు.  ఇలా తాను వేసుకున్న టాటూల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంత‌కీ ఇత‌ను ఎవ‌రో చెప్ప‌నేలేదు క‌దూ..  లండన్‌లోని వాల్తమ్‌స్టో ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో నివసించే క్రిస్ వుడ్ హెడ్ అనే టాటూ ఆర్టిస్ట్‌.logo