శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 21, 2020 , 11:13:46

అప్‌డేటెడ్ సాలీడు పురుగు.. పురుగులు, దోమ‌లే కాకుండా ఏకంగా ప‌క్షినే చ‌ప్ప‌రిచ్చేస్తుంది!

అప్‌డేటెడ్ సాలీడు పురుగు.. పురుగులు, దోమ‌లే కాకుండా ఏకంగా ప‌క్షినే చ‌ప్ప‌రిచ్చేస్తుంది!

సాలీడు పురుగులు లేకుండా ఇల్లు ఉండ‌దు. ప్ర‌తి ఇంటి మూల‌ల్లో సాలీడు ఆ గోడ నుంచి ఈ గోడ‌కు చిందులేస్తూ ఉంటుంది. శుభ్రంగా ఉన్న ఇంటికి బూజు తీసుకొచ్చి పెట్టేది సాలీడు పురుగులే. ఈ సాలీడు ఆహారంగా చిన్న చిన్న పురుగులు తీసుకుంటూ ఉంటాయి. ఇంకా కావాలంటే త‌న‌ సాలీడు వ‌ల‌లో చిక్కుకున్న దోమ‌లు, ఈగ‌ల‌ను కూడా ఆర‌గించేస్తాయి. అయితే ఎంత తిన్నా వీటి సైజు అంద‌రికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే సాలీడు చాలా అప్‌డేటెడ్‌. ఇది సైజులోనే కాదు తినే ఆహారంలో కూడా చాలా మార్పు ఉంటుంది.

ఈ సాలీడు ఏకంగా ప‌క్షినే ఆర‌గించేద్దాం అనుకున్న‌ది. దీని సైజు క‌న్నా పెద్ద సైజులో ఉన్న ప‌క్షిని నోటికి క‌రిపించుకొని కొండ‌చిలువ మింగుతున్న‌ట్లుగా మింగ‌డానికి ట్రై చేసిం‌ది. మ‌రి మొత్తానికి ఈ ప‌క్షిని తినేసిందో లేదో తెలియ‌దు కాని దాని ప్ర‌య‌త్నం మాత్రం నెటిజ‌న్ల‌ను భ‌యానికి గురి చేసింది. దీన్ని చూస్తే రాకాసి సాలీడులా క‌నిపిస్తుంది. అస‌లు అంత బ‌రువైన ప‌క్షిని ఇది ఎలా ప‌ట్టుకోగ‌లిగింద‌ని నెటిజ‌న్ల‌కు అంతుచిక్క‌డం లేదు. మ‌రి ఈ సాలీడు ఎంత ప‌రిమాణంలో ఉంది, ఆ ప‌క్షిని ఎలా తింటుందో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. 


logo