శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 12:24:01

రెండు రాళ్లు అమ్మాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు!

రెండు రాళ్లు అమ్మాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు!

పేద‌రికం, ఆక‌లి చావుల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఆఫ్రికా దేశంలోనే అధిక సంప‌న్నులు కూడా ఉన్నారు. మొన్న‌టి వ‌ర‌కు సాధార‌ణంగా బ‌తికిన ఆయ‌న ఇప్పుడు కోటీశ్వ‌రుడు అయ్యాడు. ఈయ‌న ఓ గ‌ని య‌జ‌మాని. అందులో ఉన్న రెండు రాళ్ల‌ను జూన్ నెల‌‌లో అమ్మాడు. ఒక రాయి 9.2 కేజీలు ఉండ‌గా రెండోది 5.8 కేజీలుంది. ఈ రెండు రాళ్ల విలువ అక్ష‌రాలా రూ. 25 కోట్ల వ‌ర‌కు ఉంటుంది. ఇవి మామూలు రాళ్లు కాదు. దీనిని టాంజ‌నైట్ ఖ‌నిజంతో ఉన్న‌ది. ఈ రెండు రాళ్లే కాదు. త‌ర్వాత మ‌రొక రాయి కూడా అమ్మాడు. దీనికి మరో రూ. 14 కోట్లు వెన‌కేసుకున్నాడు. సానినూ లైజ‌ర్ ద‌గ్గ‌ర ఇవే కాదు మ‌రికొన్ని రాళ్లున్నాయ‌ట‌. ఇవి కూడా 6.3 కేజీల వ‌ర‌కు బ‌రువున్నాయి.

ఈ రాళ్లు కూడా అమ్మితే ఇత‌నికి డ‌బ్బే డ‌బ్బు. చాలా అరుదుగా దొరికే ఈ రాళ్లు భూమి మీద ఎక్క‌డైనా క‌నిపించ‌వ‌చ్చ‌ని భూగ‌ర్భ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. రెడ్‌, గ్రీన్‌, ప‌ర్పుల్‌, బ్లూ క‌ల‌ర్స్‌లో క‌నిపిస్తూ రాళ్లు క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటాయి. దీని రంగును బ‌ట్టి వాటి ధ‌ర ఉంటుంది. లైజ‌ర్ ఈ రాళ్ల‌ను ప్ర‌భుత్వానికే అమ్మారు. ఇత‌నికి 30 మంది పిల్ల‌ల‌ట‌. వీరంద‌రికీ త్వ‌ర‌లో పార్టీ ఇస్తానంటున్నాడు. అంతేకాదు అత‌నికి 2000 ఆవులున్నాయి. వాటిని మ‌రింత బాగా చూసుకుంటామంటున్నాడు. ఇత‌ను ఆఫ్రికా దేశమైన టాంజానియాకు చెందిన‌వాడు. 


logo