మంగళవారం 31 మార్చి 2020
International - Feb 03, 2020 , 01:30:23

టాంజానియా తొక్కిసలాట20 మంది దుర్మరణం..

టాంజానియా  తొక్కిసలాట20 మంది దుర్మరణం..

దర్‌ ఎస్‌ సలాం, ఫిబ్రవరి 2: టాంజానియా దేశంలో ఉత్తరాన ఉన్న మోషి పట్టణంలోని ఓ చర్చిలో జరిగిన తొక్కిలాటలో సుమారు 20 మంది దుర్మరణం చెందారు. మరో 16 మంది గాయపడ్డారని అధికారులు ఆదివారం వెల్లడించారు. శనివారం జరిగిన ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఇప్పటివరకు 20 మంది చనిపోయారని, గాయపడినవారు కూడా ఉన్నందున మృతుల సంఖ్య పెరుగుతున్నదని పేర్కొన్నారు. ప్రముఖ మతబోధకుడు బొనేఫేస్‌ మ్వంపొసా నేతృత్వంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరైనప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నది. క్రీస్తు ప్రియశిష్యుడిగా చెప్పుకొనే బొనేఫేస్‌ మ్వంపొసా భక్తులను ఉద్దేశించి పవిత్రమైన నూనెను నేలపై పోశానని, దానిని తాకినవారికి స్వస్థత చేకూరుతుందని, వ్యాధులు నయమవుతాయని పేర్కొనగా.. డజన్లకొద్ది మంది భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని, 20 మంది చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రబోధకుడైన బొనేఫేస్‌ మ్వంపొసా అక్కడి నుంచి పరారయ్యారు.logo
>>>>>>