శనివారం 06 జూన్ 2020
International - May 02, 2020 , 15:10:18

కిమ్‌తో త్వ‌ర‌లో మాట్లాడుతా:ట్రంప్‌

 కిమ్‌తో త్వ‌ర‌లో మాట్లాడుతా:ట్రంప్‌

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ అతి త్వ‌ర‌లో మాట్లాడుతాన‌ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. ఈ వారాంతంలో మాట్లాడతానని స్ప‌ష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సరైన సమయంలో  తెలియజేస్తామని  వైట్‌హౌస్‌ తెలిపింది.  కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న క్ర‌మంలో.. సుమారు మూడు వారాల తర్వాత ప్రజల ముందుకు ఆయన వచ్చినట్లు కొరియా మీడియా పలు ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ  నేపథ్యంలో ఆయనతో మాట్లాడాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. కాగా కరోనా నేప‌థ్యంలో డొనాల్డ్ ట్రంప్ గ‌త నెల రోజుల నుంచి  అధికారిక నివాసం శ్వేతసౌధంలోనే ఉంటున్నారు. అక్కడి నుంచే మీడియా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఈ వారం చివర్లో మేరీల్యాండ్‌లో జ‌ర‌గ‌నున్న క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియ‌ల్ రిట్రీట్‌కు ఆయ‌న వెళ్ల‌నున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. అక్కడ జరిగే బిజినెస్ మీట్‌లో పలువురు విదేశీ ప్రతినిధులతో ట్రంప్ సమావేశాలు జరుపుతారు. అలాగే పలువురు దేశాధినేతలతో ఫోన్‌లో చర్చలు జరపనున్నారు.
logo