క్షురకులకు తాలిబన్ల తాఖీదు
కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో క్షురకులు గడ్డాలు గీయొద్దని తాలిబన్లు ఫత్వా జారీచేశారు. గడ్డాలు గీయడం, ట్రిమ్ చేయడం ఇస్లాంకు విరుద్ధమని పేర్కొంటూ.. హెల్మాండ్‌లోని తాలిబన్ ఫైటర్లు వీధుల్లో నోటీసులు అం టించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే క్షురకులు శిక్షార్హులవుతారని హెచ్చరించారు. కాబూల్‌లోని క్షురకులు కూడా ఇదే తరహా హెచ్చరికలు తమకూ జారీ అయ్యాయని చెప్పినట్టు బీబీసీ వార్తాసంస్థ తెలిపింది. తాము మారిపోయామని, ఇదివరకటిలా తీవ్రశిక్షలు ఉండబోవని నూతన తాలిబన్ పాలకులు ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
గడ్డాల నిబంధనపై ఎవరూ ఫిర్యాదు చేయడానికి వీల్లేదని కూడా తాలిబన్లు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గడ్డాలు గీసేవారిని పట్టుకునేందుకు గూఢచార తాలిబన్లను పంపిస్తామని తెలిపారు. అమెరికా ైస్టెల్ కటింగ్ సేవలు మానేయాలని తాలిబన్ అధికారుల నుంచి తనకు ఫోన్ బెదిరింపులు వచ్చాయని కాబూల్‌కు చెందిన ఓ క్షురకుడు చెప్పినట్టు బీబీసీ వెల్లడించింది. రెండురోజుల క్రితం నలుగురు కిడ్నాపర్లను తాలిబన్లు కాల్చిచంపి క్రేన్లకు వేలాడదీశారు.