కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు( Taliban ) మళ్లీ అధికారంలోకి రాగానే ఎన్ని శాంతి వచనాలు, మహిళలకు ఎన్ని భరోసాలు ఇచ్చినా.. అవేవీ ఆచరణలో మాత్రం చూపడం లేదు. తాలిబన్ల పాలన అంటే ఆఫ్ఘన్ మహిళలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా మహిళలు, చిన్నారులు ఆ దేశాన్ని వీడారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లు అక్కడి కాందహార్లో మ్యూజిక్, టీవీల్లో మహిళల గళాలపై నిషేధం విధించారు. ఇప్పటికే తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రాగానే పలు టీవీ చానెళ్లు మహిళా యాంకర్లను ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇస్లాం చట్టాలకు అనుగుణంగా మహిళలను చదవడానికి, పని చేయడానికి అంగీకరిస్తామని తాలిబన్లు ప్రకటించినా.. వాళ్లు తమ మాట నిలబెట్టుకోవడం లేదు.