శనివారం 28 నవంబర్ 2020
International - Oct 23, 2020 , 17:18:10

ఆఫ్ఘాన్‌ సైనిక స్థావరంపై తాలిబన్‌ దాడి.. 20 మంది జవాన్లు మృతి

ఆఫ్ఘాన్‌ సైనిక స్థావరంపై తాలిబన్‌ దాడి.. 20 మంది జవాన్లు మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ సైనిక స్థావరంపై తాలిబ‌న్‌ దాడి చేసింది. ఈ ఘటనలో 20 మంది జవాన్లు మరణించగా ఇద్దరిని తాలిబన్‌ మిలిటెంట్లు కిడ్నాప్‌ చేశారు. భారీగా ఆయుధాలను దోచుకున్నారు. ఫరా నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామూన 2 గంటలకు షాఖ్-ఇ-బాలా కాన్స్క్ ప్రాంతంలోని సైనిక శిబిరంపై తాలిబన్లు దాడి చేసినట్లు ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్‌ మండలి అధికారి దదుల్లా ఖని తెలిపారు. సైనికుల కాల్పుల్లో 12 మంది తాలిబన్లు కూడా మరణించినట్లు చెప్పారు. సోర్‌ షమల్ ప్రాంతంలో ఘర్షణను అదుపు చేసేందుకు భద్రతా దళం ప్రయత్నిస్తుండగా సైనిక స్థావరంపై తాలిబన్లు దాడి చేసినట్లు వెల్లడించారు. మరోవైపు సైనిక శిబిరంపై తామే దాడి చేసినట్లు తాలిబన్‌ పేర్కొంది. ఈ దాడిలో 20 మంది ఆఫ్ఘాన్‌ సైనికులు మరణించినట్లు వెల్లడించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.