శనివారం 30 మే 2020
International - May 01, 2020 , 10:40:48

ఆప్గాన్ లో మ‌రోసారి ఆత్మాహుతిదాడి

ఆప్గాన్ లో మ‌రోసారి ఆత్మాహుతిదాడి

కాబూల్:  క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు. ఆప్గ‌నిస్తాన్‌లో వ‌రుస బాంబు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. కాబూల్‌ శివార్లలో ఆర్మీ ప్రత్యేక బలగాల స్థావరంపై ఆత్మాహుతి దాడుల‌కు తెగ‌బడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించ‌గా..మ‌రో 15 మంది గాయ‌ప‌డ్డట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఈ వారంలో కాబూల్‌లో ఆత్మాహుతి దాడి జ‌ర‌గ‌డం ఇది రెండోసారి. బుధ‌వారం ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే ఈ దాడి జ‌రిగింది. అయితే  ఆఫ్గాన్ మంత్రి, యూఎస్‌ దళాల కమాండర్‌ జనరల్‌ అసదుల్లా ఖలీద్‌లు ఆర్మీ స్థావరాన్ని సందర్శించి వెళ్లిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. 


logo