International
- Dec 06, 2020 , 00:44:44
సాదాసీదాగా ప్రమాణం

కరోనా నేపథ్యంలో బైడెన్ నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని పెన్సిల్వేనియా అవెన్యూలో అత్యంత సాదాసీదాగా నిర్వహిస్తామని జో బైడెన్ తెలిపారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు జనసందోహం ఉండే రైళ్లు, కూడళ్లలాంటి చోట ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. జనవరి 20న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా కాలిఫోర్నియాలో బైడెన్ విజయాన్ని ఎన్నికల అధికారులు ధ్రువీకరించారు. ఆ రాష్ట్రంలో 55 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. వీటితో బైడెన్ అధ్యక్ష పదవికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 270ని అధికారికంగా దాటినట్టు అయింది.
తాజావార్తలు
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
- జీ7కు రండి.. ప్రధాని మోదీకి బ్రిటన్ ఆహ్వానం
- కర్నూలు వాసులకు గుడ్ న్యూస్.. ఎయిర్ పోర్ట్కు డీజీసీఏ అనుమతి
- అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?
MOST READ
TRENDING