శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 03, 2020 , 23:58:49

చైనీస్ చేప‌ల మార్కెట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోండి: ఆస్ట్రేలియా

చైనీస్ చేప‌ల మార్కెట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోండి: ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారికి మూల‌మైన చైనా చేప‌ల మార్కెట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.  కొత్తగా చైనాలో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాకపోవడంతో, అక్కడ మళ్ళీ చేపల మార్కెట్లు తెరిచారు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ ప్రధాని వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. చైనీస్ చేపల మార్కెట్లు ప్రపంచంలో ప్రధాన సమస్యని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమై చైనాపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ మేర‌కు  చైనా చేపల మర్కెట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలన్నారు.కాగా, ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలమందికిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. 55వేలకుపైగా మరణించారు. 


logo