సోమవారం 18 జనవరి 2021
International - Dec 22, 2020 , 12:59:42

ఆ దేశంలో ఏప్రిల్ త‌ర్వాత తొలి క‌రోనా కేసు న‌మోదు

ఆ దేశంలో ఏప్రిల్ త‌ర్వాత తొలి క‌రోనా కేసు న‌మోదు

క‌రోనా మ‌హ‌మ్మారి వెలుగు చూసిన త‌ర్వాత కొన్ని దేశాలు దానికి దాసోహ‌మంటే.. మ‌రికొన్ని మాత్రం దీనిని స‌మ‌ర్థంగా అడ్డుకున్నాయి. అలాంటి దేశాల్లో తైవాన్ ఒక‌టి. మొద‌ట్లోనే క‌రోనాను అడ్డుకునేందుకు ఈ దేశం తీసుకున్న చ‌ర్య‌లతో ఈ మ‌హ‌మ్మారి చాలా వ‌ర‌కు నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చింది. 250 రోజుల పాటు అక్క‌డ స్థానికంగా ఒక్క కేసు కూడా న‌మోదు కాలేదు. విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌లోనే కొన్ని కేసులు వ‌చ్చాయి. అయితే తాజాగా ఏప్రిల్ 12 త‌ర్వాత మ‌ళ్లీ మంగ‌ళ‌వారం స్థానికంగా సంక్ర‌మించిన‌ ఒక కేసు నమోదైంది. న్యూజిలాండ్‌కు చెందిన పైల‌ట్ స్నేహితురాలికి వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు. 

దీంతో ఆమెతో స‌న్నిహితంగా ఉన్న మ‌రో 100 మందికి టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. ఆదివారం స‌ద‌రు న్యూజిలాండ్ పైల‌ట్‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు. అత‌నితో స‌న్నిహితంగా ఉన్న కార‌ణంగా 30 ఏళ్ల ఈ మ‌హిళ‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షిహ్‌-చుంగ్ వెల్ల‌డించారు.  స‌ద‌రు పైల‌ట్ తైవాన్‌లో తిరిగిని అన్న ప్ర‌దేశాల‌లో ఇప్పుడు అక్క‌డి ప్ర‌భుత్వం హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించింది. స్థానికంగా న‌మోదైన కేసుతో సంబంధం ఉన్న 167 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. తైవాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 771 కేసులు న‌మోదు కాగా.. అందులో చాలా వ‌ర‌కు విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్లే కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఇంకా 130 మంది క‌రోనాతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఇవి కూడా చదవండి..

జోష్‌కు జోష్‌.. గూగుల్‌, మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు

నేను వెళ్తున్నా..మీ సత్తా చాటండి:కోహ్లీ

ఏడేండ్ల క్రితం యాక్సిడెంట్‌.. దక్కిన కోటి పరిహారం

57,000 ఏళ్లనాటి తోడేలు కళేబరం అట్లాగే ఉందట..!