శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 18:48:28

చెక్ రిపబ్లిక్ స్పీకర్‌పై చైనా బెదిరింపులను ఖండించిన తైవాన్

చెక్ రిపబ్లిక్ స్పీకర్‌పై చైనా బెదిరింపులను ఖండించిన తైవాన్

తైపీ: చెక్ రిపబ్లిక్ స్పీకర్‌పై చైనా అసభ్య బెదిరింపులను తైవాన్ ఖండించింది. అవి అసౌకర్యాన్ని కలిగించే చల్లని, శీతాకాలపు గాలులుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. చెక్ రిపబ్లిక్ స్పీకర్‌ మిలోస్ వైస్ట్రిల్ చైనా తనదిగా చెప్పుకుంటున్న తైవాన్‌ను మంగళవారం సందర్శించారు. ఆ దేశ పార్లమెంట్‌లో ఆయన ప్రసంగించారు. తాను కూడా తైవాన్‌కు చెందినవాడినని ఆయన అన్నారు. 1963‌లో దివంగత అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ బెర్లిన్‌లో కమ్యూనిజాన్ని ధిక్కరించారని చెప్పారు. అదేవిధంగా నాడు చైనా ఘర్షణపై  ఆగ్రహం వ్యక్తం చేసి తైవాన్‌కు సహకరించి ప్రశంసలు పొందారని గుర్తు చేశారు. కాగా చెక్ రిపబ్లిక్ స్పీకర్‌ మిలోస్ వైస్ట్రిల్ ప్రసంగాన్ని తైవాన్ పార్లమెంట్ స్పీకర్ యు సి-కున్ ప్రశంసించారు. ఆయన ప్రసంగం తైవాన్ ప్రజల మనసులను కదిలించిందని అన్నారు.

మరోవైపు తైవాన్‌ను సందర్శించడమేగాక పార్లమెంట్‌లో ప్రసంగించిన చెక్ రిపబ్లిక్ స్పీకర్‌ మిలోస్ వైస్ట్రిల్‌పై చైనా మండిపడింది. ఆయన త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి హెచ్చరించారు. అయితే చైనా బెదిరింపులను మిలోస్ తిప్పికొట్టారు. తమ దేశ విదేశీ విధానం మేరకు తైవాన్‌ను అధికారికంగా సందర్శించినట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత దేశాలు ఎల్లప్పుడూ సహకరించుకోవాలని ఆయన అన్నారు. మరోవైపు చెక్ రిపబ్లిక్ స్పీకర్‌పై చైనా అసభ్య బెదిరింపులను తైవాన్ గురువారం ఖండించింది. అవి అసౌకర్యాన్ని కలిగించే చల్లని, శీతాకాలపు గాలులుగా ఉన్నాయని ఎద్దేవా చేసింది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo