శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 17, 2020 , 16:01:12

కోవిడ్ తీవ్ర‌త త‌గ్గాలంటే.. T క‌ణాలే కీల‌కం !

 కోవిడ్ తీవ్ర‌త త‌గ్గాలంటే.. T క‌ణాలే కీల‌కం !

హైద‌రాబాద్‌: నోవ‌ల్ క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో T క‌ణాలు కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు ప‌రిశోధ‌కులు అంచ‌నా వేశారు. అమెరికాలోని లా జొల్లా ఇమ్యూనాల‌జీ ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని చెప్పారు. సెల్ జ‌ర్న‌ల్‌లో త‌మ నివేదిక‌ను వారు ప్ర‌చురించారు. కోవిడ్‌19ని త‌గ్గించాలంటే శ‌రీర రోగ‌నిరోధ‌క శ‌క్తిలోని T క‌ణాల పాత్ర విశేష‌మైంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. వ్యాధి తీవ్ర‌త అదుపులోకి రావాలంటే.. శ‌రీరంలోని హెల్ప‌ల్‌(టీహెచ్‌) లేదా కిల్ల‌ర్‌(సీఎల్‌టీ) క‌ణాలు కీల‌కమైన‌వ‌ని పేర్కొన్నారు. యాంటీబాడీల‌తో పాటు T క‌ణాలు ఎక్కువ ఉంటేనే వైర‌స్ ఉదృతిని త‌గ్గించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు.  ఇన్‌ఫెక్ష‌న్ ఎక్కువ ఉన్న కేసుల్లో యాంటీబాడీల క‌న్నా.. టీ క‌ణాల ప్రాముఖ్య‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.  65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో T క‌ణాల సంఖ్య‌ త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్లే.. వారిలో కోవిడ్‌ను త‌గ్గించే ప్రక్రియ క‌ష్టంగా మారుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. ఇమ్యూనిటీని పెంచుకోవ‌డంలో యాంటీబాడీల‌తో పాటు హెల్ప‌ర్‌, కిల్ల‌ర్ టీ క‌ణాలు కూడా కీల‌క‌మ‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు.


logo