శుక్రవారం 05 జూన్ 2020
International - May 05, 2020 , 08:33:02

సిరియాలోని స‌ఫీరా మిల‌ట‌రీ డిపోలు ల‌క్ష్యంగా వైమానిక దాడులు

సిరియాలోని స‌ఫీరా మిల‌ట‌రీ డిపోలు ల‌క్ష్యంగా వైమానిక దాడులు

సిరియా: సరియాలోని ఆగ్నేయ శివారు ప్రాంత‌మైన స‌ఫీరాలోని అలెప్పో ప్రాంతంలో ఉన్న మిల‌ట‌రీ డిపోలు ల‌క్ష్యంగా క్షిప‌ణి దాడులు జ‌రిగిన‌ట్లు స‌రియా సైనిక క‌మాండ్ తెలిపింది. ఇజ్రాయిల్ సైనిక హెలికాప్ట‌ర్లు సిరియా ద‌క్షిణ భాగంపై క్షిప‌ణి దాడి చేఇన‌ట్లు తెలిపింది. అలెప్పోలోని ఓ సైంటిఫిక్ రీసెర్చ్ సెంట‌ర్‌పై ఇజ్రాయిల్ దాడికి పాల్ప‌డిన‌ట్లు సానా వార్త సంస్థ వెల్ల‌డించింది. నిన్న అర్థ‌రాత్రి స‌మ‌యంలో వైమానిక ర‌క్ష‌ణ మానిట‌ర్ల‌లో శ‌త్రు విమానాలు క‌నిపించాయి. అవి ఇట్రియా ఈశాన్య వైపు నుంచి వ‌చ్చిన‌ట్లు గుర్తించాం. స‌ఫీరా ప్రాంతంలో అనేక సైనిక డిపోల‌పై దాడి జ‌రిగింది. మా వాయుర‌క్ష‌ణ సిబ్బంది శ‌త్రు క్షిప‌ణుల‌ను తిప్పికొట్టాయ‌ని పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న‌పై స్పందించ‌డానికి ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ‌శాఖ‌(ఐడీఎఫ్‌) నిరాక‌రించింది. మేము విదేశీ మీడియాలో వ‌చ్చిన నివేదిక‌ల‌పై వ్యాఖ్యానించ‌మ‌ని ఐడీఎఫ్ వెల్ల‌డించింది. 


logo