బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 24, 2020 , 02:06:46

ప్రపంచంలోనే అత్యంత చిన్న బంగారు నాణెం!

ప్రపంచంలోనే అత్యంత  చిన్న బంగారు నాణెం!
  • ముద్రించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వ నాణేల తయారీ సంస్థ

బెర్లిన్, జనవరి 23: ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన బంగారపు నాణేన్ని స్విట్జర్లాండ్ ప్రభుత్వ నాణేల తయారీ సంస్థ స్విస్‌మింట్  తయారు చేసింది. ఆ నాణెంపై ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ నాలుక బయటపెట్టి ఉన్న చిత్రాన్ని కూడా ముద్రించింది. 2.96 మిల్లీ మీటర్ల వ్యాసం(0.12 అంగుళాలు) కలిగిన ఈ నాణెం బరువు 0.063 గ్రాములని గురువారం సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీని తయారీకి 0.26 డాలర్ల( రూ.18) ఖర్చు అయిందని వాళ్లు పేర్కొన్నారు. ప్రత్యేక భూతద్దాన్ని నాణెంపై అమర్చడం వల్ల ఐన్‌స్టీన్ చిత్రాన్ని ఎవరైనా వీక్షించవచ్చని తెలిపారు. కాగా.. ఇలాంటి నాణేల్ని 999 తయారు చేశామని, ఒక్కో నాణేన్ని 199 డాలర్ల (రూ.14,189)కు విక్రయించనున్నట్టు ప్రతినిధులు వెల్లడించారు. 


logo
>>>>>>