గురువారం 28 మే 2020
International - Apr 15, 2020 , 14:02:53

60 మీట‌ర్ల ఎత్తులో ఎగిరిన కారు..బ‌తికిన డ్రైవ‌ర్..వీడియో

60 మీట‌ర్ల ఎత్తులో ఎగిరిన కారు..బ‌తికిన డ్రైవ‌ర్..వీడియో

పోలండ్ : సాధారణంగా సినిమాల్లో ఫైటింగ్‌, ఛేజింగ్ సీన్ల స‌మ‌యంలో కార్లు, సుమోలు గాల్లోకి ఎగిరిన విష‌యం తెలిసిందే. పోలండ్ లోని ర‌వీన్ ప‌ట్ట‌ణంలో ఉన్న రోడ్డుపై నుంచి సుజుకి స్విఫ్ట్ కారు వేగంగా దూసుకొచ్చింది. స్విఫ్ట్ కారు ఓ స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న డివైడ‌ర్ కు ఢీకొట్టి ఒక్క‌సారిగా గాల్లోకి ఎగిరింది. సుమారు 60మీట‌ర్ల ఎత్తులో గాల్లోకి ఎగిరింది...అయితే  అందులో ఉన్న డ్రైవ‌ర్ (41) మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డటం గ‌మ‌నార్హం. 

అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి వ‌చ్చి కారులో నుంచి డ్రైవ‌ర్ ను బ‌య‌ట‌కు తీసి..ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఈ వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

అగ్నిమాపక సిబ్బంది మంట‌లు వస్తున్న కారులో నుంచి డ్రైవ‌ర్ ను బ‌య‌ట‌కు తీశారు.  కారు డ్రైవ‌ర్ ఆల్కాహాల్ సేవించి డ్రైవింగ్ చేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలండ్ లో ఆల్కాహాల్ సేవించి డ్రైవింగ్ చేస్తే రెండేళ్లు జైలు శిక్ష విధిస్తారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo