మంగళవారం 26 మే 2020
International - Apr 17, 2020 , 17:46:52

వాలంటీర్‌గా మారిన స్వీడ‌న్ యువ‌రాణి

వాలంటీర్‌గా మారిన స్వీడ‌న్ యువ‌రాణి

కొవిడ్‌-19ను త‌రిమికొట్ట‌డానికి వైద్యులు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రోగులు పెడుగుతూ ఉండ‌డంతో ట్రీట్‌మెంట్‌కు వైద్యులు స‌రిపోవ‌డం లేదు. అందుకు కొంత‌మంది శిక్షణ తీసుకొని వాలంటీర్లుగా సేవ‌లందిస్తున్నారు. వారిలో స్వీడ‌న్ యువ‌రాణి సోఫియా కూడా ఉన్నారు. స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు ఇంటెన్సివ్ ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం తీసుకున్న తర్వాతే..  వాలంటీర్ హెల్త్‌కేర్ అసిస్టెంట్‌గా చేరింది. 35 ఏండ్ల సోఫియా హెమ్మెట్ హాస్పిట‌ల్‌లో వాలంటీర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాలంటీర్‌గా చేయ‌డానికి సోఫియా రాయ‌ల్ సెంట్ర‌ల్‌ను అనుమ‌తి కోరింది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా వైద్యులు, న‌ర్సుల‌కు భారం త‌గ్గించేందుకు  హాస్పిట‌ల్ ప్ర‌తివారం 80 మందికి శిక్ష‌ణ ఇస్తున్న‌ది. వంట‌గ‌దిలో ప‌నిచేయ‌డం, శుభ్ర‌ప‌ర‌చ‌డం, క్రిమిసంహార‌క ప‌రిక‌రాలు వంటి ప‌నులు చేస్తూ వారికి సాయ‌ప‌డుతున్నారు. సోఫియా వాలంటీర్‌గా బ్లూ డ్రెస్ ధ‌రించి బాధ్య‌త‌లు చేప‌డుతున్న‌ది. సోఫియా గ‌తంలో మోడ‌ల్‌. ఇప్పుడు కింగ్ కార్ల్ గుస్టాఫ్ కుమారుడు ప్రిన్స్ కార్ల్ ఫిలిప్‌ని  పెళ్లి చేసుకున్న‌ది. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. 

వైరస్ వ్యాప్తిని మందగించడానికి అనేక ఇతర దేశాల మాదిరిగా కఠినమైన లాక్డౌన్ చర్యలను విధించలేదని స్వీడన్ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ మీడియా విమర్శించారు. 1.02 కోట్ల జనాభా ఉన్న దేశంలో నేటికి 170 కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం 12,540 కేసులు నమోదయ్యాయి.


logo