శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 17, 2020 , 13:43:55

కరోనా రోగుల సేవలో స్వీడన్ యువరాణి

కరోనా రోగుల సేవలో స్వీడన్ యువరాణి

హైదరాబాద్: కరోనాకు రాజూపేదా తేడా లేదు. బ్రిటన్ ప్రధానినీ చుట్టేసింది. స్పానిష్ రాకుమారినీ పొట్టనపెట్టుకుంది. అలాగే కరోనాపై విశ్వవ్యాప్తంగా జరుగుతున్న పోరులో అందరూ దూకుతున్నారు. ఐర్లాండ్ ప్రధాని మళ్లీ తెల్లకోటు వేసుకున్నారు. అందాల పోటీలో కిరీటాలు పెట్టుకున్న అమ్మాయి కూడా స్టెతస్కోప్ అందుకున్నారు. తాజాగా స్వీడన్ రాకుమారి ఆకోవలోకి వచ్చిచేరారు. యువరాణి సోఫియా (35) తాను గౌరవ చైర్ పర్సన్ గా ఉన్న సోఫియాహెమ్మెట్ హాస్పిటల్ లోనే సహాయకురాలిగా చేరారు. అందుకు ఆమె మూడు రోజుల శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే ఆమె కోవిడ్-19 రోగులకు ఆమె వైద్యసేవలు అందించరు. ఎందుకంటే ఆమె వృత్తిరీత్యా డాక్టరు కాదు. వైద్యేతర పనులకు సహాయకురాలిగా పనిచేసేందుకు ఆమె ముందుకు వచ్చారు. నేల తుడవడం, కిచెన్‌లో పాత్రలు కడగడం, వైద్య పరికరాలను శుభ్రం చేయడం వంటి సహాయక పాత్రలో ఆమె పనిచేస్తారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది మీద పనిభారం తగ్గించేందుకు ఇలాంటి సహాయకులను నియమిస్తారు.


logo