గురువారం 28 మే 2020
International - Apr 06, 2020 , 16:17:16

దేశ ప్ర‌జ‌ల‌కు స్వీడ‌న్ ప్ర‌ధాని తీవ్ర హెచ్చ‌రిక‌

 దేశ ప్ర‌జ‌ల‌కు స్వీడ‌న్ ప్ర‌ధాని తీవ్ర హెచ్చ‌రిక‌

క‌రోనా నేప‌థ్యంలో స్వీడ‌న్ ప్ర‌ధాని ఆ దేశ ప్ర‌జ‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  క‌రోనా నియంత్రించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం కొన్ని ఆంక్ష‌లు విధించ‌గా...వాటిని లెక్క‌చేయ‌కుకండా బీచ్‌లు, రెస్టారెంట్ల‌కు వెళ్తుండ‌టం ప‌ట్ల స్వీడ‌న్ ప్ర‌ధాని స్టీఫ‌న్ లావెన్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌కుండా వేలాది మంది చావుకు ఎదురుచూస్తున్నార‌ని మండిప‌డ్డారు. మీకు మీరే డెత్‌ను ఆహ్వానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్ప‌టికే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్ డౌన్ పాటిస్తుంటే..స్వీడ‌న్‌లో మాత్రం ప‌బ్బులు, బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లు జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.  ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని అక్క‌డి వైద్యులు, నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాగా స్వీడన్‌లో లాక్‌డౌన్‌ను ప్రకటించకుండా ఎలాంటి కార్యక్ర‌మాల్లోనైనా 50 మందికి మించి పాల్గొన‌కూడ‌దంటూ ఆంక్ష‌లు విధించింది. సోష‌ల్ డిస్టన్స్ పాటించాల‌ని కోరింది. అయితే దీన్ని మాత్రం ఎవరు లెక్క చేయడం లేదు.  స్వీడన్‌లో ఇప్పటి వరకు 6,830 కరోనా కేసులు నమోదుకాగా, 401 మంది మరణించారు.logo