గురువారం 04 జూన్ 2020
International - May 14, 2020 , 20:26:47

జకీర్‌ను అప్పగించండి: భారత్‌

జకీర్‌ను అప్పగించండి: భారత్‌

న్యూఢిల్లీ: వివాదాస్పద మత గురువు జకీర్‌ నాయక్‌ను అప్పగించాలని భారత ప్రభుత్వం మరోసారి మలేషియా ప్రభుత్వాన్ని కోరింది. భారత్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు మలేషియా ప్రభుత్వవర్గాలు గురువారం తెలిపాయి. భారత్‌లో మతసామరస్యానికి విఘాతం కలిగించడం, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం వంటి ఆరోపణలను జకీర్‌ నాయక్‌ ఎదుర్కొంటున్నారు. భారత్‌లో ఉంటే అరెస్ట్‌ చేస్తారన్న భయంతో ఆయన మలేషియాకు పారిపోయి గత మూడేండ్లుగా అక్కడే ఉంటున్నాడు. గతేడాది ఈస్ట్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొన్న సందర్భంలో మలేషియా ప్రధాని మహథీర్‌ మహ్మద్‌ను కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ మేరకు జకీర్‌ నాయక్‌ అప్పగింత విషయంపై చర్చించినట్లు సమాచారం. 2016 ఢాకాలోని హోలీ ఆర్టిసన్‌ బేకరీలో ఉగ్రదాడికి సంబంధించిన కేసులో అటు మలేషియాలో, ఇటు భారత్‌లో జకీర్‌ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. 


logo