ఆదివారం 24 జనవరి 2021
International - Dec 05, 2020 , 15:02:56

క్రిస్మస్‌కు వారింటికి అనుకోని అతిథి..!

క్రిస్మస్‌కు వారింటికి అనుకోని అతిథి..!

అడిలైడ్‌: క్రిస్మస్‌ను పురస్కరించుకొని ఆ కుటుంబం క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటుచేసింది. రెండురోజులు వేరే ఊరికి వెళ్లారు.. తిరిగి వచ్చే చూసేసరికి ఆ చెట్టుపై అనుకోని అతిథి కనిపించింది. ఒక్కసారిగా అడవిజంతువును చూసిన యజమాని ఆశ్చర్యపోయింది. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా వైరల్‌ అవుతోంది. 

దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ సమీపంలో కోరమాండల్ వ్యాలీలో నివసిస్తున్న అమండా మెక్‌కార్మిక్ తన క్రిస్మస్‌ ట్రీపై కోలా అనే అడవిజంతువును గమనించింది. వెంటనే ఆమె తన కెమెరాల్లో దాన్ని బంధించింది. అనంతరం కోలా రెస్క్యూ ఆర్గనైజేషన్ ‘1300 కోలాజ్‌’కు సమాచారం అందించింది. వారు వచ్చి కోలాను తీసుకెళ్లారు. కాగా, క్రిస్మస్‌ట్రీపై కోలా ఉన్న వీడియోక్లిప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌ అవుతోంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo