శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 12, 2020 , 02:55:30

ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి

ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి

  • భారతీయ అమెరికన్‌ వైద్యుడి ఘనత 
  • కరోనా రోగికి విజయవంతంగా ఆపరేషన్‌ 

న్యూయార్క్‌: కరోనా రోగికి రెండు ఊపిరితిత్తులు ఒకేసారి మార్పిడిచేసి రికార్డు సృష్టించింది భారతీయ అమెరికన్‌ వైద్యుడి నేతృత్వంలోని బృందం. ఇల్లినాయిస్‌కు చెందిన ఓ కరోనా రోగికి గత 100 రోజులుగా ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజెనేషన్‌ (ఈసీఎంవో) సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు రెండు ఊపిరితిత్తులు చెడిపోవటంతో షికాగోలోని నార్త్‌ వెస్టర్న్‌ మెమోరియల్‌ దవాఖానలో థొరోసిక్‌ సర్జరీ విభాగ అధిపతిగా పనిచేస్తున్న అంకిత్‌ భరత్‌ అనే భారతీయ అమెరికన్‌ వైద్యుడి నేతృత్వంలో ఒకేసారి రెండు ఊపిరితిత్తులను ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. గత నెలలో కూడా 20 ఏండ్ల యువతికి అంకిత్‌ ఇలాంటి చికిత్సే విజయవంతంగా నిర్వహించారు.


logo