శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 09, 2020 , 19:33:33

హిందీలో ట్విట్టర్ ఖాతా తెరిచిన ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా

హిందీలో ట్విట్టర్ ఖాతా తెరిచిన ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించారు. తాజాగా ఆయన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. హిందీతోపాటు పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, ఇంగ్లీష్ వంటి భాషల్లో ట్విట్టర్ ఖాతాలను తెరిచారు.

81 ఏండ్ల ఆయతుల్లా 1989 నుంచి ఇరాన్ సుప్రీం నాయకుడిగా ఉంటున్నారు. 1981 నుంచి 1989 వరకు ఇరాన్ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇరాన్‌‌కు ఆయన రెండో సుప్రీం నేత. ఆ దేశంలో సుప్రీం నేతదే పెత్తనం. అధ్యక్షుడు సహా పార్లమెంట్ సభ్యులంతా కలిసి సుప్రీం నేతను ఎన్నుకుంటారు.

logo