బుధవారం 03 జూన్ 2020
International - Mar 28, 2020 , 08:16:07

ఆ ‘దగ్గు’ విలువ రూ.26 లక్షలు!

ఆ ‘దగ్గు’ విలువ రూ.26 లక్షలు!

పెన్సిల్వేనియా: కరోనా కారణంగా దేశాలకు దేశాలు లాక్‌డౌన్‌ అవుతున్నాయి. నిత్యావసరాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఒక మహిళ చేసిన పిచ్చి చేష్టతో ఒక సూపర్‌మార్కెట్‌ ఏకంగా రూ.26 లక్షల విలువైన ఆహార పదార్థాలను పారబోయాల్సి వచ్చింది. ఆమె ఉద్దేశపూర్వకంగా ఆహార పదార్థాలపై దగ్గింది. దీన్ని ప్రాంక్‌గా (సరదా చేష్టగా) తాము పరిగణించినప్పటికీ, కస్టమర్ల ఆరోగ్యం దృష్ట్యా ఆ సరుకునంతటినీ పారబోసినట్లు స్టోర్‌ యాజమాన్యం వెల్లడించింది. పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.


logo