సోమవారం 19 అక్టోబర్ 2020
International - Oct 08, 2020 , 02:03:33

సన్‌రైజర్స్‌ గాడిలో పడేనా..!

 సన్‌రైజర్స్‌ గాడిలో  పడేనా..!

  • నేడు పంజాబ్‌తో ఢీ 

దుబాయ్‌: ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒడిదొడుకులతో సాగుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(ఎస్‌ఆర్‌హెచ్‌).. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం వేదికగా పంజాబ్‌తో  జరిగే మ్యాచ్‌లో సత్తాచాటి గాడిలో పడాలని వార్నర్‌  సేన పట్టుదలగా ఉంది. వరుస ఓటములతో లీగ్‌ను మొదలుపెట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ విజయాల బాట పట్టిందనుకున్న తరుణంలోనే  గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడింది. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ దూరం కావడం హైదరాబాద్‌కు ఎదురుదెబ్బగా మారింది. దీంతో చివరి ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పాటు బ్యాట్స్‌మెన్‌ సమిష్టిగా రాణించాల్సి ఉంది. మరోవైపు  ఐదు మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచిన పంజాబ్‌  ఎలాగైనా గెలువాలని పట్టుదలగా ఉంది. వరుసగా విఫలమవుతున్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు బదులుగా హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.


logo