శనివారం 06 జూన్ 2020
International - May 18, 2020 , 00:30:23

సూర్యుడు కూడా లాక్‌డౌన్‌లోకి..

సూర్యుడు కూడా లాక్‌డౌన్‌లోకి..

  • కొనసాగుతున్న ‘సోలార్‌ మినిమమ్‌' దశ

వాషింగ్టన్‌: కరోనా విశ్వమారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో ఉండి గమనించారో లేదో గానీ ఈసారి ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అంతగా లేవు. దీనికి కారణం సూర్యుడిపై నిరంతరం జరిగే కేంద్రక సంలీన చర్యలు మందకొడిగా సాగుతుండటమే. దీంతో ‘సన్‌ స్పాట్స్‌' సంఖ్య తగ్గిపోయాయి. దీన్నే ‘సోలార్‌ మినిమమ్‌' అంటారు. దీన్ని నెటిజన్లు ఫన్నీగా ‘సూర్యుడు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాడు’ అని పిలుస్తున్నారు. సోలార్‌ మినిమమ్‌ కారణంగా సూర్యునిపై అయస్కాంత క్షేత్రాలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా సౌర కుటుంబంలోకి కాస్మిక్‌ కిరణాలు విస్తరిస్తాయి. ఈ కిరణాల కారణంగా పిడుగులతో కూడిన తుఫాన్లు సంభవించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. 1790-1830ల మధ్య నమోదైన అతి శీతల ఉష్ణోగ్రతలకు ‘సోలార్‌ మినిమవ్‌ు’ చర్యే కారణమని నాసా శాస్త్రవేత్తలు వివరించారు. ప్రతి 11 ఏండ్లకోసారి ఈ చర్య జరుగుతూనే ఉంటుందని.. అయితే ప్రమాదం తీవ్రత ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని తెలిపారు. logo