బుధవారం 03 జూన్ 2020
International - May 13, 2020 , 19:58:44

కరోనాతో మృతి చెందిన సుమో

కరోనాతో మృతి చెందిన సుమో

కరోనా ఏ రంగాన్నీ వదలడం లేదు. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి జపాన్‌కు చెందిన క్రీడాకారున్ని బలితీసుకుంది. జపాన్‌కు చెందిన 28 ఏండ్ల సుమో శౌబుషి కరోనా మహమ్మారి సోకి మృతి చెందాడు. శౌబుషి అసలు పేరు కియోటకా సువేటకే. ఇతను జపాన్‌కు చెందిన సుమోల్లో మంచి క్రీడాకారునిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అనేక అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో పాల్గొన్న శౌబుషి మరణం క్రీడారంగంలో ఆ దేశానికి తీరని లోటుగా చెప్పొచ్చు. సుమో ఆటగాళ్లలో కరోనా వల్ల మరణించిన తొలి సోమో కూడా శౌబుషినే.. అంతే కాకుండా 20 నుంచి 30 ఏళ్ళ వయసులో కరోనాతో మరణించిన ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా ఇతనే.


logo