బుధవారం 03 జూన్ 2020
International - May 11, 2020 , 16:52:42

అలిగిన పిల్లి.. బతిమాలిన కుక్క.. ఫన్నీ వీడియో

అలిగిన పిల్లి.. బతిమాలిన కుక్క.. ఫన్నీ వీడియో

పిల్లి, కుక్క రెండూ ఎద‌రుప‌డ్డాయంటే ఇక అంతే రెండో ప్ర‌పంచ యుద్ద‌మే అన్న‌ట్లు ఉంటుంది. పిల్లి పారిపోవ‌డం కుక్క పెరెగెత్తించ‌డం. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న బంధం ఇది మాత్ర‌మే అని అంద‌రూ అనుకుంటారు. వీరి మ‌ధ్య మంచి స్నేహం కూడా ఉంటుందండోయ్‌. అది నిజం చేయ‌డానికి కుక్కల‌ ఫ్యామిలీ ఫొటోషూట్‌కు రెడీ అయింది. వీరి ఫ్యామిలీలోకి పిల్లిని కూడా ఆహ్వానించాయి. వీరి కుటుంబంలోకి నేను ఎందుకులే అన్న‌ట్లుగా పిల్లి వ‌చ్చి కూర్చొంటుంది. కెమెరా క్లిక్ అయ్యే స‌మాయానికి పిల్లి ముఖం తిప్పుకుంటుంది. దాంతో ఆ మూడు కుక్క‌ల్లోని ఒక కుక్క పిల్లిని బుజ్జ‌గించి ఫొటో దిగేందుకు సిద్దం చేసింది. ఈ మూగ‌జీవాలు ఫొటోకు ఫోజులివ్వ‌డ‌మే కాదు మంచి డ్రెస్సింగ్ కూడా మెయిన్‌టైన్ చేశాయి. ష‌ర్ట్‌, మెడ‌కు టైలు అన్ని ధ‌రించి టిప్‌టాప్‌గా రెడీ అయ్యాయి. మ‌నుషులు కూడా ఇంత బాగా త‌యార‌వ్వ‌రేమో అన్న‌ట్లున్నాయి. ఈ వీడియోను ట్విట‌ర్‌లో ఫోస్ట్ చేశారు. వీటి ఫొటోషూట్‌ను మీరు కూడా చేసేయండి. 


logo