గురువారం 21 జనవరి 2021
International - Nov 29, 2020 , 13:34:14

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి.. 26 మంది భద్రతా సిబ్బంది మృతి

ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి.. 26 మంది భద్రతా సిబ్బంది మృతి

ఘజ్ని : ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం ఆత్మాహుతి కారు బాంబు దాడిలో.. సుమారు 26 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారని అధికారులు తెలిపారు. తూర్పు ప్రావిన్స్‌లో ఘజ్ని రాజధాని ఘజ్ని శివార్లలో ఈ దాడి జరిగింది. ఇప్పటి వరకు 26 మృతదేహాలను గుర్తించామని, మరో 17 మంది వరకు గాయపడ్డారని పేర్కొన్నారు. వారంతా భద్రతా సిబ్బందేనని, గాయపడ్డ వారిని ఘజ్ని హాస్పిటల్‌ డైరెక్టర్‌ బాజ్‌ మహ్మద్‌ హేమత్‌ చెప్పారు. ఘజ్ని ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు నాసిర్ అహ్మద్ ఫక్రీ మరణాల సంఖ్యను ధ్రువీకరించారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దాడికి పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ పేర్కొన్నారు.


logo